Logo
Download our app
తెలంగాణ క‌ల్ప‌త‌రువు కాళేశ్వ‌రం
NEWS   Jun 08,2025 05:54 am
దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్‌తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఇది తెలంగాణ రాష్ట్రానికి క‌ల్ప‌త‌రువు లాంటిద‌న్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముందు 122 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 1183.94 కోట్లకు పెరిగింది అంటే 9 రేట్లు పెరిగిందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముందు 40 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 4300 కోట్లకు పెరిగింది అంటే 107 రేట్లు పెరిగిందన్నారు. జూరాల ప్రాజెక్టు ముందు 70 కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి 1815 కోట్లకు పెరిగింది అంటే 25 రేట్లు పెరిగిందని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source