Logo
Download our app
బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు
NEWS   Jun 08,2025 05:47 am
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. గతవారం బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందన్నారు. డీపీఆర్ ను ఇంకా పరిశీలించ లేద‌న్నారు. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దన్నారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏవిధంగా నష్టం జరుగుతుందో కేంద్రానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source