Logo
Download our app
అన్నమయ్య జిల్లాలో టీడీపీకి షాక్
NEWS   Jun 07,2025 12:02 pm
టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీనియ‌ర్ నేత సుగ‌వాసి బాల‌సుబ్ర‌మ‌ణ్యం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతలే తనను ఓడించారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తమకు పార్టీ కాదు కార్యకర్తలే ముఖ్యమని స్ప‌ష్టం చేశారు. వచ్చే ఎన్నిక్లలో రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతామంటూ ప్రక‌టించారు. తండ్రి సుగవాసి పాలకొండ్రాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే గా ఒకసారి ఎంపీగా గెలిచిన చ‌రిత్ర త‌న తండ్రిది.
⚠️ You are not allowed to copy content or view source