Logo
Download our app
ఏపీలో త్వ‌రిత‌గ‌తిన ప్రాజెక్టుల నిర్మాణం
NEWS   Jun 07,2025 08:31 am
ఏపీలో త్వ‌రిత‌గ‌తిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. తుపానుల నుండి పంటలను రక్షించేందుకు పంట కాలం ముందుకు జరపాలని సీఎం సూచించార‌ని తెలిపారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్థ వినియోగం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల‌న్నారు. నీటి పారుద‌ల శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source