Logo
Download our app
విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు
NEWS   Jun 07,2025 06:14 am
భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీకి షాక్ త‌గిలింది. ఆర్సీబీ విజ‌యోత్స‌వ ర్యాలీ సంద‌ర్బంగా బెంగ‌ళూరులో తొక్కిస‌లాట చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌పై ఆర్సీబీతో పాటు క‌ర్నాట‌క క్రికెట్ అసోసియేష‌న్ పై కేసు న‌మోదు చేశారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌కు విరాట్ కోహ్లీ కూడా కార‌ణమంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు రియ‌ల్ ఫైట‌ర్స్ ఫోరం చీఫ్ వెంక‌టేష్ క‌బ్స‌న్ పార్క్.
⚠️ You are not allowed to copy content or view source