Logo
Download our app
ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేను మావాడే అంటే ఎలా..?
NEWS   Jun 06,2025 03:12 pm
మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీ మ‌ల్లు ర‌వి అంటే గౌర‌వం ఉంద‌న్నారు. ఎమ్మెల్యే విజ‌యుడుతో ప్రోటోకాల్ పాటించ‌డం త‌ప్పు కాద‌న్నారు. కానీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేను మా వాడే అనడం పార్టీ లైన్ దాటినట్లే అవుతుందన్నాడు. ఇంటికి వచ్చిన వారిని గౌరవించడంలో తప్పు లేదు కానీ సన్మానాలు చేయడం, ఫోటోలు దిగడం ఏంటీ అంటూ ప్ర‌శ్నించారు. ఇదంతా పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టినట్లే అవుతుందన్నారు. నేను పార్టీ లైన్ దాటి మాట్లాడ లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source