Logo
Download our app
తిరుమ‌ల‌లో శ్రీ‌వారి జ్యేష్టాభిషేకం
NEWS   Jun 06,2025 08:10 am
ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడు రోజుల‌ పాటు ఆ దేవ దేవుడికి నిర్వ‌హించ‌నున్నారు. బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రెండవ రోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడవ రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source