కార్పొరేటర్ హుస్సేన్ మృతి
NEWS Jun 05,2025 07:15 am
హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. కాంచన్ బాగ్ ఒవైసీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశం నుండి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.