Logo
Download our app
11 మంది మృతి ప్ర‌ధాని దిగ్భ్రాంతి
NEWS   Jun 05,2025 07:02 am
ఆర్సీబీ విజ‌యోత్స‌వం సంద‌ర్బంగా బెంగ‌ళూరులో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 11 మంది మృతి చెంద‌డం, 50 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డ‌డం ప‌ట్ల స్పందించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. మృతి చెందిన కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. కేంద్ర స‌ర్కార్ స‌హాయం చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని క‌ర్ణాట‌క స‌ర్కార్ కు సూచించారు మోదీ.
⚠️ You are not allowed to copy content or view source