Logo
Download our app
ఇది స‌మిష్టి విజ‌యం - పాటిదార్
NEWS   Jun 04,2025 08:56 am
ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియ‌న్ కావ‌డం ప‌ట్ల కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు ఆ జ‌ట్టు స్కిప్ప‌ర్ ర‌జ‌త్ పాటిదార్. జ‌ట్టు యాజ‌మాన్యం త‌మ‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నామ‌ని అన్నాడు. ఈ విజ‌యం సులువుగా రాలేద‌న్నాడు. చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పంజాబ్ తో మ్యాచ్ సాగింద‌ని చెప్పాడు. కానీ అంతిమంగా గెలుపు త‌మ‌దేన‌ని త‌న‌కు ముందే తెలుస‌న్నాడు. ప్ర‌ధానంగా బ్యాట‌ర్ల‌తో పాటు త‌మ టీమ్ బౌల‌ర్లు అద్భుతంగా బంతులు వేశార‌ని, ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్ల‌కు చుక్క‌లు చూపించార‌ని పేర్కొన్నారు. మొత్తంగా ఇది స‌మిష్టి విజ‌య‌మ‌ని స్ప‌ష్టం చేశాడు .
⚠️ You are not allowed to copy content or view source