Logo
Download our app
ఎండీయు డ్రైవ‌ర్ల‌ను స్మ‌గ్ల‌ర్లంటే ఎలా..?
NEWS   Jun 01,2025 07:49 pm
మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్పాటు చేసిన ఎండీయు డ్రైవ‌ర్ల‌ను స్మ‌గ్ల‌ర్లు అంటూ కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. కూట‌మి స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది డ్రైవ‌ర్లు రోడ్డున ప‌డ్డార‌ని ఆవేద‌న చెందారు. నాదెండ్ల మ‌నోహ‌ర్, నారా లోకేష్ ఇద్ద‌రూ రేష‌న్ బియ్యం స్మ‌గ్ల‌ర్లుగా అవ‌తారం ఎత్తారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. డ్రైవ‌ర్ల‌ను తిరిగి తీసుకునేంత దాకా పోరాటం చేస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source