Logo
Download our app
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు
NEWS   Jun 01,2025 05:11 pm
ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది శ్రీ‌శైలం ప్రాజెక్టుకు. ఓ వైపు జూరాల ప్రాజెక్టు సైతం క‌ళ‌క‌ళ లాడుతోంది. ఇన్ ఫ్లో 30,797 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మ‌ట్టం 885 అడుగులు కాగా ప్ర‌స్తుత నీటి మ‌ట్టం 839.80 అడుగుల‌కు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామ‌ర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్ర‌స్తుతం శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొన‌సాగ‌డం లేదు.
⚠️ You are not allowed to copy content or view source