Logo
Download our app
8న క్రికెట‌ర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్
NEWS   Jun 01,2025 03:42 pm
ఇండియ‌న్ క్రికెట‌ర్ రింకూ సింగ్ ఇంటివాడు కాబోతున్నాడు. యూపీకి చెందిన స‌మాజ్ వాది లీడ‌ర్ ప్రియా స‌రోజ్ తో ఈనెల 8న నిశ్చితార్థం చేసుకోనున్నాడు. ఈ ఇద్ద‌రు గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. రింకూ సింగ్ ఐపీఎల్ తో పాటు భార‌త క్రికెట్ జ‌ట్టు త‌ర‌పున టి20 మ్యాచ్ ల‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. ల‌క్నోలోని పేరు పొందిన ఓ హొటల్ లో వీరి ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌ముఖ క్రికెట‌ర్ల‌తో పాటు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ య‌జ‌మాని షారుక్ ఖాన్ కూడా హాజ‌ర‌వుతార‌ని టాక్.
⚠️ You are not allowed to copy content or view source