Logo
Download our app
టెన్త్ పరీక్షల రీకౌంటింగ్ పై ష‌ర్మిల ఫైర్
NEWS   Jun 01,2025 03:11 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీ టెన్త్ పరీక్షల రీకౌంటింగ్ పై వైఎస్ జగన్, లోకేష్ వాదనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయంటూ మండిప‌డ్డారు. రెండు ప్రభుత్వాలు విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించాయన్నారు. వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదని,పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలే పదేళ్లుగా ఫెయిల్ అయ్యాయంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పిల్లల భవిష్యత్తును నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్లు రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తారంటూ ప్ర‌శ్నించారు.
⚠️ You are not allowed to copy content or view source