ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
NEWS Jun 01,2025 10:39 am
రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక అప్ డేట్ వచ్చింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును విచారణకు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీంతో 14 నెలలుగా అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు గత్యంతరం లేక జూన్ 5న విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారు. ఆయన ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత బీఆర్ఎస్ హయాంలో చిల్లర పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.