Logo
Download our app
కొండగట్టు అంజన్న ఆదాయం 1కోటి 95వేలు
NEWS   May 30,2025 09:50 pm
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో 24 రోజులకు 12 హుండీలను కార్యనిర్వాహాణాధికారి శ్రీకాంత్ రావు పర్యవేక్షణలో లలితా సేవా ట్రస్ట్ వారు శుక్రవారం లెక్కించారు. హుండీ ఆదాయము రూ. 1,00,95,392 నగదు, 44 విదేశీ కరెన్సీ లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే వచ్చిన వెండి, బంగారాన్ని ఒక బ్యాగులో వేసి సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. అధికారులు అర్చకులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source