Logo
Download our app
నాకు సొంత అజెండా ఏమీ లేదు
NEWS   May 30,2025 02:30 pm
త‌న‌కంటూ సొంత అజెండా ఏమీ లేద‌న్నారు ఎమ్మెల్సీ క‌విత‌. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన అని పేర్కొన్నారు. ఆ పార్టీతో స‌హ‌వాసం చేసిన ఏ పార్టీ బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌లేద‌న్నారు. తాను కేసీఆర్ ను చాలాసార్లు క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నం చేశాన‌ని , కానీ క‌ల‌వ‌లేక పోయాన‌ని వాపోయారు. రాసిన లేఖ‌ను బ‌య‌ట పెట్టిన వారిని ప‌ట్టుకోవాల‌ని పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించ లేదంటూ ప్ర‌శ్నించారు. కేసీఆర్‌కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source