Logo
Download our app
శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
NEWS   May 29,2025 07:18 am
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 02 నుండి జూన్ 10వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోస్టర్ ను టిటిడి ఈవో జె. శ్యామల రావు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయంలో చలువ పందిళ్లు, వైట్ పెయింట్, ఆకట్టుకునేలా రంగోలీలు, విద్యుత్ అలంకరణలు, పెయింటింగ్స్, పుష్పలంకరణలు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహ‌న సేవ‌లు జ‌ర‌గ‌నున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source