Logo
Download our app
సీఎం పదవికి అంత తొందర ఏముంది..?
NEWS   May 28,2025 06:36 am
మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ మ‌హానాడు సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ప్ర‌పంచంలోనే ప్రాంతీయ పార్టీగా చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాలు సాధించిన ఘ‌న‌మైన చ‌రిత్ర టీడీపీకి ఉంద‌న్నారు. త‌దుప‌రి సీఎం ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు ఆయ‌న ఆన్స‌ర్ ఇచ్చారు. ఆ ప‌ద‌వి కోసం ఎందుకు అంత తొంద‌ర ప‌డాలంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుత సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. తాను కొడుకునై పుట్టినందుకు గ‌ర్వ ప‌డుతున్నాన‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source