Logo
Download our app
ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, రైట‌ర్
NEWS   May 27,2025 05:28 pm
ఖమ్మం జిల్లా ఏదులాపురం పురపాలిక పరిధిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు సబ్ రిజిస్ట్రార్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్. ఖమ్మం మండలం తల్లంపాడుకు చెందిన ఒక వ్యక్తి తన రెండెకరాల భూమిని కొడుకు పేరున గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్‌ను కలవగా, రూ.50 వేలు డిమాండ్ చేసింది. రూ.30 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకొని, ఏసీబీకి సమాచారం ఇచ్చాడు బాధితుడు. డాక్యుమెంట్ రైటర్ వెంకటేష్ కారులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
⚠️ You are not allowed to copy content or view source