Logo
Download our app
77 మంది ఉద్యోగులకు మెమోలు జారీ
NEWS   May 27,2025 05:25 pm
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప‌ని చేస్తున్న 77 మంది ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరవ్వడం వంటి చర్యలకు పాల్పడిన‌ట్లు గుర్తించారు. ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అకస్మిక తనిఖీల్లో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు సూపరిండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ .కాగా ఎంజీఎం చరిత్రలో ఒకేసారి ఇంత మందికి మెమోలు జారీ చేయడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.
⚠️ You are not allowed to copy content or view source