Logo
Download our app
ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న
NEWS   May 27,2025 05:10 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే ఫిలిం ఛాంబర్ నుంచి ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. అది హరిహర వీరమల్లు సినిమాకూ వర్తిస్తుందన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రాఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తోందన్నారు. సినిమా హాళ్ల‌ బంద్ వెనక ఉన్న శక్తులేవో విచారించాలన్నారు. ఈ ఘటనలో జనసేన వాళ్లున్నా చర్యలకు వెనకాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాల‌ని మంత్రిని ఆదేశించారు డిప్యూటీ సీఎం.
⚠️ You are not allowed to copy content or view source