విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్
NEWS May 27,2025 05:06 pm
అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులను తీవ్రంగా హెచ్చరించింది. వీసా నిబంధనల మేరకు తరగతులకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. తరగతులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. స్టడీ ప్రోగ్రామ్స్ కు హాజరు కాకపోయినా తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. వీసా రద్దుతో పాటు అమెరికాకు రాకుండా అనర్హులుగా ప్రకటిస్తామంటూ తీవ్రంగా హెచ్చరికలు జారీ చేయడం కలకలం రేపింది.