Logo
Download our app
దొంగల బీభత్సం బంగారం ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు దొంగలించినట్లు
NEWS   May 27,2025 04:43 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భూంనగర్ లోని ఓ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చొరబడి భారీగా బంగారు నగలు, అపహరించారు. పెద్దపల్లికి చెందిన సదయ్య, సందీప్ అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇల్లు తాళం వేసి ఉండగా గత రాత్రి దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బీరువాలు, కబోర్డులను ధ్వంసం చేసి బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను అపహరించినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి సిఐ ప్రవీణ్ దర్యాప్తు చేస్తున్నారు.
⚠️ You are not allowed to copy content or view source