Logo
Download our app
ప్ర‌ధాని మోదీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ
NEWS   May 25,2025 06:33 pm
ఢిల్లీలో జ‌రిగిన ఎన్డీయే కీల‌క స‌మావేశంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచాడు ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ సంద‌ర్బంగా త‌నను ప్ర‌త్యేకంగా ఆహ్వానించాడు ప్ర‌ధాని మోదీ. త‌న‌తో క‌లిసి మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే , అజిత్ ప‌వార్ తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి టేబుల్ వ‌ద్ద కూర్చోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మోదీ ప‌వ‌ర్ స్టార్ కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇవ్వ‌డం చ‌ర్చకు దారితీసేలా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.
⚠️ You are not allowed to copy content or view source