Logo
Download our app
బీజేపీ కోసమే కల్వకుంట్ల ఇంటి పంచాయితీ
NEWS   May 25,2025 03:59 pm
టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ కోసమే క‌ల్వ‌కుంట్ల ఇంటి పంచాయ‌తీ తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్నారు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికే ఉంటుంది తప్ప కుటుంబానిది ఉండదన్నారు. వాళ్లకు వాళ్లే పొలిటికల్ పర్సనాలిటీగా ఊహించుకుని తండ్రిపై దండయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కవిత లీకులు, లేఖలతో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు బీజేపీలోకి వెళ్లే ప్రమాదం ఉంద‌న్నారు. కవిత ఎపిసోడ్ వల్ల కాంగ్రెస్ కు వచ్చే నష్టమేమీ లేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source