Logo
Download our app
పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికే ప‌ద‌వులు
NEWS   May 25,2025 10:34 am
మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నెల్లూరులో పార్టీ న‌గ‌ర‌డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలతో స‌మీక్ష చేప‌ట్టారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండే వారికే పదవుల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామ‌న్నారు. ఐదు దేవాలయాల కమిటీ చైర్మన్లు, పాలకమండలి సభ్యుల ఎంపికపై చర్చించామ‌న్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని, పారదర్శకంగా పదవుల్లో ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. అన్ని కులాల‌కు చోటు ద‌క్కుతుంద‌ని, ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌కు ఛాన్స్ ఇస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source