బలపడిన అల్ప పీడనం
NEWS May 24,2025 10:32 am
ఇవాళ కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతు పవనాలు. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్ప పీడనం బలపడింది. 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఆపై రెండు, మూడు రోజుల్లోనే ఏపీకి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.