యోగా జీవితంలో భాగం కావాలి - అనిత
NEWS May 24,2025 10:08 am
మన జీవితంలో యోగా అన్నది భాగం కావాలని పిలుపునిచ్చారు మంత్రి వంగలపూడి అనిత. విశాఖ బీచ్ రోడ్ లో జరుగుతున్న యోగాడే కార్యక్రమంలో పాల్గొన్నారు. 11వ వేడుకలు మన నగరంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని చెప్పారు. యోగా అంటేనే భారతీయ వ్యవస్థలో సాంప్రదాయంగా వస్తున్న ఒక వ్యవస్థ అన్నారు. యోగాతో ఆసనాలు చేయడం కాదు శరీరంలో భాగం కావాలన్నారు. రోజుకు ఒక గంట సమయం కేటాయిస్తే చాలన్నారు.