Logo
Download our app
రూ.200 కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్
NEWS   May 23,2025 05:08 pm
కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదారాబాద్ కేంద్రంగా రూ.200 కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానుంద‌ని తెలిపారు. చిరు ధాన్యాలపై పరిశోధన, ఉత్పత్తిలో హైదరాబాద్ కేంద్రం కీలకం కానుందన్నారు. అంతే కాకుండా రైల్వే రక్షణకు సంబంధించిన కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు కానుంద‌ని ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source