Logo
Download our app
రాజ‌ధాని అమ‌రావ‌తి స‌క్సెస్ కాదు
NEWS   May 23,2025 03:26 pm
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తి స‌క్సెస్ కాద‌న్నారు. కృష్ణా న‌దిలో కేపిటిల్ సిటీ క‌డితే ఎలా అని ప్ర‌శ్నించారు. సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని విష‌యంలో పొర‌పాటు చేస్తున్నాడంటూ మండిప‌డ్డారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాడని , ఆ డ‌బ్బులు ఎక్క‌డి నుంచి తెస్తున్నాడో చెప్పాల‌న్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్ నిర్మాణానికి పదింతలు అదనపు ఖర్చు అవుతుందన్నారు. సెక్రటేరియట్ కోసం 50 అంతస్తుల భవనాన్ని కట్టాలని అనుకుంటున్నారని, భవిష్యత్తులో ఆ బిల్డింగ్ కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారంటూ నిల‌దీశారు చింతా మోహ‌న్.
⚠️ You are not allowed to copy content or view source