Logo
Download our app
సీఎం ఓఎస్డీనంటూ డబ్బులు డిమాండ్
NEWS   May 23,2025 11:21 am
ముఖ్య‌మ‌త్రి రేవంత్ రెడ్డి పీఎస్ ను అంటూ డ‌బ్బులు కావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఏపీలోని శ్రీ‌కాకుళం జిల్లా న‌ర్స‌న్న‌పేట‌కు చెందిన నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. జీమెయిల్స్ , వాట్సాప్ మెసేజ్ ల ద్వారా అడిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బొల్లినేని ఇన్ ప్రా ప్రాజెక్ట్స్ ఎండీ శ్రీకృష్ణ మోహన్ బొల్లినేని, ర్యాపిడో ఎండీ అరవింద్ సంకా, గుప్తా రియాలిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా వెర్రబొమ్మ, కంట్రీడిలైట్ ఎండీ చక్రధర్, నితిన్ కౌశల్‌తో పాటు ఎంతో మందికి మెయిల్స్ చేసిన‌ట్లు గుర్తించారు . సాంకేతిక ఆధారాలతో ఏపీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source