Logo
Download our app
తండ్రి కేసీఆర్ కు క‌విత సంచ‌ల‌న లేఖ
NEWS   May 22,2025 07:37 pm
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత దూకుడు పెంచారు. గురువారం ఆమె సంచ‌ల‌న లేఖ రాశారు. ఇందుకు సంబంధించి ఇది బ‌య‌ట‌కు రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తండ్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సిందన్నారు. 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేద‌న్నారు. ధూం ధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామ‌ని పేర్కొన్నారు క‌విత‌. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source