పిడుగుపాటుకు దెబ్బతిన్న హనుమాన్ ఆలయం
NEWS May 22,2025 05:47 pm
ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలో రాత్రి పిడుగు పాటుకు హనుమాన్ ఆలయ గోపురం ధ్వంసమైంది. ఇవాళ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు దర్శనం కోసం ఉదయం వెళ్లగా.. గోపురం గోడలు కూలి పోవడంతో కంగుతిన్నారు. గ్రామ ప్రజలు ఆలయాన్ని పరిశీలించగా. పైన పిడుగు పడిన ఆనవాళ్లు కనపడ్డాయి. ఈ అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.