Logo
Download our app
గుజ‌రాత్, పంజాబ్, బెంగ‌ళూరు, ముంబై ప్లే ఆఫ్స్ కు
NEWS   May 22,2025 08:56 am
ఐపీఎల్ 2025 ఆఖ‌రు ద‌శ‌కు చేరుకుంది. ప్లే ఆఫ్స్ కు చేరుకునే జ‌ట్లు ఖ‌రారు అయ్యాయి. ఇప్ప‌టికే గుజ‌రాత్ టైటాన్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్లు త‌మ బెర్త్ ల‌ను క‌న్ ఫ‌ర్మ్ చేసుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం తీవ్ర‌మైన పోటీ నెల‌కొన్న త‌రుణంలో ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ను ఓడించింది. ప్లే ఆఫ్స్ కు ద‌ర్జాగా చేరుకుంది. టోర్నీ ప్రారంభంలో నాలుగు మ్యాచ్ లు ఓడి పోయి అనూహ్యంగా పుంజుకుని స‌త్తా చాటింది.
⚠️ You are not allowed to copy content or view source