Logo
Download our app
మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు మృతి..?
NEWS   May 21,2025 01:22 pm
మావోయిస్టు అగ్ర‌నేత నంబాల కేశ‌వ‌రావు అలియాస్ బ‌స‌వ‌రాజు(66) మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. బ‌స‌వ‌రాజు ఉన్నార‌న్న స‌మాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చుట్టిముట్టిన‌ట్లు స‌మాచారం.నంబాల కేశ‌వ‌రావు స్వ‌స్థ‌లం శ్రీకాకుళం జిల్లా జియ్య‌న్న‌పేట‌. ఈయ‌న తండ్రి ఉపాధ్యాయుడు. వ‌రంగ‌ల్ ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చ‌దివారు. 1984లో ఎంటెక్ చ‌దువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల ప‌ట్ల ఆక‌ర్షితుల‌య్యారు. పీపుల్స్ వార్ వ్య‌వ‌స్థాప‌కుల్లో నంబాల కేశ‌వ‌రావు ఒక‌రు. 2010లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 76 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మృతి ఘ‌ట‌న‌కు నంబాల సూత్ర‌ధారి. ఐఈడీల వినియోగంలోనూ ఆయ‌న నిపుణుడు. కేశ‌వ‌రావుపై రూ. 1.5 కోట్ల రివార్డు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source