ఏపీలో రేషన్ వాహనాలు రద్దు
NEWS May 20,2025 08:01 pm
ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ హయాంలో తీసుకు వచ్చిన రేషన్ వ్యాన్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జూన్ 1 నుంచి చౌకధర దుకాణాల్లోనే రేషన్ పంపిణీ చేస్తామన్నారు. వృద్దులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ ను డోర్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించారు.