ఆగస్టు 29న విశాల్ తో పెళ్లి - ధన్సిక
NEWS May 20,2025 01:09 pm
తమిళ సినీ నటుడు ధనుష్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి సాయి ధన్సిక. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తన మనసులోని మాటను వ్యక్తం చేసింది. ఇటీవలే అనారోగ్యానికి గురై బయట పడిన విశాల్ రెడ్డిని తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అంతే కాదు ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేశామని పేర్కొంది. వచ్చే ఆగస్టు 29న తామిద్దరం ఒక్కటి కాబోతున్నట్లు తెలిపింది.