Logo
Download our app
ఐపీఎల్ నుంచి ల‌క్నో అవుట్
NEWS   May 20,2025 08:24 am
స్వంత గ‌డ్డ‌పై విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాల‌ని త‌పించిన రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కు చుక్క‌లు చూపించింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. వ‌రుస ఓట‌ముల‌తో తీవ్ర నిరాశ క‌న‌బ‌ర్చిన ఎస్ ఆర్ హెచ్ చివ‌ర‌కు పోతూ పోతూ ల‌క్నో ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించింది. 6 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. మొద‌ట 206 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ముందుంచింది. ఓపెన‌ర్స్ మార్ష్ 39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 65 ర‌న్స్ చేయ‌గా మార్క్ 38 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స‌ర్ల‌తో 61 ర‌న్స్ చేశాడు. నికోల‌స్ పూర‌న్ 26 బంతుల్లో 45 ర‌న్స్ చేయ‌డంతో భారీ స్కోర్ సాధ్య‌మైంది.
⚠️ You are not allowed to copy content or view source