Logo
Download our app
భారీ వ‌ర్షాల‌తో జ‌ర భ‌ద్రం
NEWS   May 20,2025 07:39 am
ఏపీ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఉష్ణోగ్రతలు 38°C-40°C మధ్య నమోదయ్యేందుకు అవకాశం ఉందన్నారు.గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయ‌ని, హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడ రాదన్నారు.పిడుగులతో కూడిన భారీ వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source