Logo
Download our app
ఆర్టీఐ క‌మిష‌న‌ర్లుగా బీసీలు ప‌నికి రారా
NEWS   May 19,2025 08:57 pm
జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. తాజాగా ప్ర‌భుత్వం నియ‌మించిన ఆర్టీఐ చీఫ్ క‌మిష‌న‌ర్, క‌మిష‌న‌ర్ల నియామ‌కంలో రూల్స్ ను పాటించ‌లేద‌ని ఆరోపించారు. అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన బీసీల‌లో ఎవ‌రూ దొర‌క లేదా అని ప్ర‌శ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పైకి బీసీల జ‌పం చేస్తూ లోప‌ల అంతా త‌న కులానికి చెందిన వారికే ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నాడ‌ని ఆరోపించారు. జ‌న గ‌ణ‌న చేసింది మీరే, దాన్ని గొప్ప‌గా చెప్పుకునేది మీరే..కానీ వాస్త‌వానికి తూట్లు పొడిచేది కూడా మీరేన‌ని ఎద్దేవా చేశారు. వీరి నియామ‌కంపై తాము కోర్టుకు వెళతామ‌ని ప్ర‌క‌టించారు గౌడ్.
⚠️ You are not allowed to copy content or view source