Logo
Download our app
మ‌హిళ‌ల జోలికి వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు
NEWS   May 19,2025 02:39 pm
రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌లు, బాలిక‌లు, యువతుల ప‌ట్ల ఎవ‌రైనా అస‌భ్య‌క‌రంగా వ్య‌వ‌హ‌రించినా లేదా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టినా తాట తీస్తామ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ రాయ‌పాటి శైల‌జ‌. సోమ‌వారం మంగ‌ళ‌గిరి లోని మ‌హిళా క‌మిష‌న్ కార్యాల‌యంలో చైర్ ప‌ర్స‌న్ గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి అత్యున్న‌త‌మైన ప‌ద‌విని, అంత‌కు మించిన బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించినందుకు సీఎంకు, డిప్యూటీ సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మహిళ హక్కులు, సంక్షేమ సాధనకు తోడ్పడతాన‌ని స్ప‌ష్టం చేశారు రాయ‌పాటి శైల‌జ‌.
⚠️ You are not allowed to copy content or view source