Logo
Download our app
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ష‌ర్మిల డెడ్ లైన్
NEWS   May 19,2025 11:11 am
తొల‌గించిన 2 వేల మంది కాంట్రాక్టు కార్మికుల‌ను వెంట‌నే తీసు కోవాల‌ని డిమాండ్ చేశారు ఏఐసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల రెడ్డి. రేప‌టి లోగా తీసుకోక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. లేకుంటే ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ ఎదుటే APCC చీఫ్ ఆమరణ దీక్ష చేస్తామ‌ని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం ప్రాణత్యాగానికి సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. విశాఖ ఉక్కు యాజమాన్యానిది నిరంకుశ ధోరణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు .
⚠️ You are not allowed to copy content or view source