Logo
Download our app
భ‌క్తుల ర‌ద్దీతో తిరుమ‌ల కిట‌కిట‌
NEWS   May 19,2025 09:34 am
తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మ‌ల‌ను 84 వేల 571 మంది ద‌ర్శించుకున్నారు. 33 వేల 372 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం 31 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source