Logo
Download our app
ల‌ష్క‌రే తొయిబా టాప్ టెర్ర‌రిస్ట్ హ‌తం
NEWS   May 19,2025 06:48 am
లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ ను దారుణంగా కాల్చి చంపారు. పాకిస్తాన్ లో ఖలీద్ ను కాల్చి చంపారు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు. లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి పని చేస్తున్న సైఫుల్లా ఖలీద్. ఉగ్రవాదులు నేపాల్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్లాన్ చేశాడు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి తో 2005 ఐఐఎస్సీ క్యాంపస్ దాడి వెనక కూడా ఖలీద్ పాత్ర ఉంది. 2001 రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్ పై దాడి ఘటనలోనూ సైఫుల్లా నిందితుడిగా ఉన్నాడు. చాలా కాలం పాటు నేపాల్ లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించాడు.
⚠️ You are not allowed to copy content or view source