Logo
Download our app
ఏపీలో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ క‌రువు
NEWS   May 18,2025 05:38 pm
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా వైఫ‌ల్యం చెందిందంటూ ఆరోపించారు. ప్ర‌ధానంగా బ‌హుజ‌నులు, ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వాపోయారు. ఆదివారం ఆయ‌న ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తిరుపతిలో ఇంజినీరింగ్‌ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source