Logo
Download our app
ఘోర ప్రమాదం అనిత దిగ్భ్రాంతిక‌రం
NEWS   May 18,2025 04:37 pm
హైదరాబాద్ లో జ‌రిగిన ఘోర అగ్నిప్రమాదంపై స్పందించారు ఏపీ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గుల్జార్ హౌస్ సమీపంలోని భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఏకంగా 17 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌న్న వార్త త‌న‌ను క‌లచి వేసింద‌న్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు. మృతి చెందిన కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఎండ‌లు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source