13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు
NEWS May 18,2025 08:04 am
అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ విషయంలో నిబంధనలు అతిక్రమించారని కడప జిల్లాలోని 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో 20 ఏళ్ల కాలపరిమితితో అసైన్డ్ భూముల పై రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణలు చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారించింది. అప్పట్లో ఆయా మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.