మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట
NEWS May 17,2025 03:24 pm
మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును కొట్టివేసింది న్యాయస్థానం. 2017, ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీధర్ బాబుపై కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 300 మంది రైతులపై కేసు నమోదు చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేక పోవడంతో కేసు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది కోర్టు.