Logo
Download our app
కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న భూమ‌న
NEWS   May 17,2025 12:10 pm
టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ కావాల‌ని క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని ఆరోపించారు. నిజాయితీపరులైన అధికారులను జైలులో పెట్టారని అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించారంటూ ఫైర్ అయ్యారు. పాల‌న చేత‌కాక రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని మండిప‌డ్డారు. త‌మ త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు కావాల‌ని త‌మ పార్టీని బ‌లహీన ప‌ర్చ‌డంలో భాగంగానే ఇలాంటి అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ వికృత ఆనందం పొందుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు భూమ‌న‌.
⚠️ You are not allowed to copy content or view source